పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గౌలివాడ సమీపంలోని మెగా కంపెనీ కార్యాలయం అకౌంట్స్ విభాగంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి పంప్ హౌస్‌ని నిర్మిస్తున్న ఈ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గదిలోని బీరువా పగలగొట్టి రూ. 20 లక్షలను దొంగిలించారు.
బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన మెగా కంపెనీ అధికారులు చోరీ జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం సహాయంతో రామగుండం సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.