తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంతనాల గుట్టు బయటపడిందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మౌలాలి భరత్ నగర్లో నివసించే శ్రావణ్ అలియాస్ చిన్నా వృత్తిరీత్యా పెయింటింగ్ పని చేసేవాడని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసగామారి గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని... నిందితునిపై గోల్కొండ, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాని డీసీపీ తెలిపారు.
బెయిల్పై బయటకి వచ్చిన శ్రావణ్... ఈనెల 24వ తేదీన నేరేడ్మెట్లోని గీతానగర్లో తాళం వేసిన ఇంటిలో దొంగతనానికి పాల్పడి... సుమారు 1.7 లక్షల రూపాయల విలువచేసే పూజా సామగ్రి మరియ చీరలను దొంగలించాడని వివరించారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.