సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త దేవయ్యకు తీవ్ర గాయలు కాగా... సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంతలోకాలకు.. - సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంతలోకాలకు..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మర గ్రామానికి చెందిన గుడికందుల దేవయ్య యాకమ్మలు... తిరుమలగిరిలో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:వాట్సాప్లో స్టేటస్ పెట్టి యువకుడి బలవన్మరణం