కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడిని కంటైనర్ ఢీకొంది. కంటైనర్‌ని ఆపాలని చెప్పినా ఆపకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన కార్మికుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రి తీసుకెళ్లగా... పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.
కార్మికుడిని ఢీకొన్న కంటైనర్... తీవ్ర గాయాలు - తెలంగాణ తాజా వార్తలు
రోడ్డు మరమ్మతులు చేస్తుండగా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులో ప్రమాదం జరిగింది. కంటైనర్ ఆపాలని చెప్పినా... ఆగకుండా రావడం వల్ల కార్మికుడిని ఢీకొంది. తీవ్రగాయాలపాలైన అతడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కార్మికుడిని ఢీకొన్న కంటైనర్... తీవ్ర గాయాలు
గాయపడిన కార్మికుడు వికారాబాద్ జిల్లా బాణాపూర్ గ్రామానికి చెందిన యాదప్పగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'కూలి'న బతుకులు: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం