తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గ్రేటర్‌ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి - గ్రేటర్‌ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కొండాపూర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీసు సిబ్బందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ ప్రైవేటు ఉద్యోగి మృతి చెందాడు.

road accident
గ్రేటర్‌ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

By

Published : Nov 28, 2020, 3:08 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ గ్రామ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు సిబ్బందితో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఓ ప్రైవేటు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పని చేస్తున్న నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో బస్సు వేగంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details