టాటా ఏసీ వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా పాతూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
వికారాబాద్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన యువకులు హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణువర్ధన్రెడ్డి.. బైక్పై వికారాబాద్ నుంచి పాతూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హరికృష్ణ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్కు తరలించారు.