తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాజీవ్‌ రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోర్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

road-accident-at-pragnapur-in-siddipet-one-dead
రాజీవ్‌ రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి

By

Published : Oct 12, 2020, 8:24 AM IST

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. పాతూరు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఇంట్లో అవసరాల కోసం ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిన సత్యం అనే వ్యక్తిని రాజీవ్ రహదారిపై వెనక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం అక్కడికక్కడే మృతి చెందారు.

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన బర్రెంకల సత్యం ఐకేపీ ఏపీఎంగా పని చేస్తున్నారు. కొంతకాలంగా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం.. చూపు పోయిందని బాధితుల ఫిర్యాదు!

ABOUT THE AUTHOR

...view details