హైదరాబాద్ పంజాగుట్టలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వెళ్తున్న కారు.. పంజాగుట్ట పోలీసు స్టేషన్ వద్ద పాలు తీసుకెళ్తున్న మినీ లారీని ఢీకొట్టింది. కూడలి వద్ద సిగ్నల్ పడటంతో పాల లారీ ఆగింది.
మినీ లారీని ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు - latest road accidents in hyderabad
మినీ లారీని కారు ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మినీ లారీని ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు..
వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొనటంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో... పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.