గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రందేవ్గూడాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. వాహనం నడుపుతున్న సంగమేశ్ (27) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక ఉన్న సంతోష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం - speed
గోల్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రందేవ్ గూడాలో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా... మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికిి చేరుకొని సంగమేశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంతోష్‌ను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.