మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాము అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితో పాటు ఉన్న క్రాంతి అనే మరో యువకుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
లారీ-ద్విచక్ర వాహనం ఢీ... ఓ వ్యక్తి మృతి - మంచిర్యాల జిల్లా నేర వార్తలు
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తోన్న లారీ అటుగా వెళ్తోన్న ద్విచక్రవానాన్ని వెనుకవైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఓ వ్యక్తి మృతి
వృత్తిరీత్యా వారిద్దరు ఫోటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి మందమర్రి నుంచి మంచిర్యాల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వెనకాల నుంచి అతి వేగంగా లారీ వచ్చి ఢీకొట్టడం వల్ల ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:విషాదాంతం.. ఒంటరితనం తట్టుకోలేక ఆత్మహత్య!