ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి - రేవంత్ రెడ్డి వార్తలు
15:00 January 05
ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి
ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదన్న రేవంత్ రెడ్డి పిటిషన్ పై అ.ని.శా. కోర్టు ఈనెల 11న తీర్పు వెల్లడించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వివాదం ప్రజాప్రాతినిథ్య చట్టం లేదా ఐపీసీ కింద నమోదు చేయాలని రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదించారు. ఓటుకు నోటు కేసులో అభియోగాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోనివేనని అ.ని.శా. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యపై అభియోగాలు నమోదయ్యాయని.. హైకోర్టు కూడా ధ్రువీకరించిందన్నారు. రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణార్హం కాదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న అ.ని.శా. న్యాయస్థానం నిర్ణయాన్ని ఈనెల 11కి వాయిదా వేసింది. మంగళవారం విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.
ఇదీ చదవండి:రామతీర్థం ఉద్రిక్తం.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం