తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిడ్నాపర్​ రవిశేఖర్ అరెస్ట్​

By

Published : Aug 3, 2019, 5:17 PM IST

Updated : Aug 3, 2019, 6:08 PM IST

కిడ్నాపర్​ రవిశేఖర్ అరెస్ట్​

17:11 August 03

రవిశేఖర్​పై 55 కేసులు

    కిడ్నాపర్​ రవిశేఖర్​ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశేఖర్... రవి అలియాస్ శ్రీధర్ రెడ్డి అలియాస్ రవీందర్ బాబు అలియాస్ అశోక్ బాబు అనే పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 2001లో మొదటిసారిగా బంధువునే మోసం చేసిన ఆయన​... ఎక్కువగా ప్రభుత్వ అధికారిగా చెప్పుకొంటూ డబ్బు కోసం మోసాలకు చేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్​వాడీ, ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో తనిఖీ కోసం విజిలెన్స్ అధికారిగా దాడులు చేసి... మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు తెలిసినట్లు సీపీ వివరించారు. నిందితుడిపై ఇప్పటికి 55 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు.

ఇదీ చూడండి: పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

Last Updated : Aug 3, 2019, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details