ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సీసాల పరిశ్రమల్లో పనిచేస్తున్న 15 మంది మైనర్లను పోలీసులు శనివారం రెస్క్యూ చేశారు. ఈ ఘటన హయత్‌నగర్ పరిధిలోని కళానగర్, పసుమాములలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శ్రీ పవన్‌పుత్ర, లక్ష్మణ్ ప్లాస్టర్ కంపెనీలపై దాడి చేయగా భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లల్ని గుర్తించి కాపాడారు.
రెస్క్యూ ఆపరేషన్: 15 మందిని కాపాడిన పోలీసులు - cp mahesh bhagavath latest news
హయత్‌నగర్ పరిధిలోని పలు పరిశ్రమలపై పోలీసులు దాడులు నిర్వహించారు. భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న 15 మంది పిల్లల్ని రక్షించారు. వీరిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
రెస్క్యూ ఆపరేషన్: 15 మందిని కాపాడిన పోలీసులు
పరిశ్రమ యజమానులు వీరిని బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అతి తక్కువ కూలి ఇస్తూ.. ఎక్కువ సమయం పని చేయించుకుంటున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆయా కంపెనీల యజమానులు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మణ్, రవిపై కేసులు నమోదు చేయగా.. రవిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం