ఈనెల 15న మేడ్చల్ జిల్లా నాచారంలోని రెండు ఇళ్లలో చోరీ చేసిన ముగ్గురి నిందితుల్లో సద్దార్, ఆయూబ్‌లను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వీరి నుంచి 42 తులాల బంగారం, 70 తులాల వెండి అభరణాలు, 36 వేల నగదు, ఒక మారుతి కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇళ్లలో చోరీ చేసిన దొంగల ముఠా అరెస్టు - Telangana crime news 2020
మేడ్చల్ జిల్లా నాచారంలో ఈనెల 15న రెండు ఇళ్లలో చోరీ జరిగింది. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వారి నుంచి సొమ్ము, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు సీపీ చెప్పారు. దర్యాప్తులో భాగంగా.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలనలో ఓ వ్యక్తిపై అనుమానం కలిగిందన్న మహేశ్ భగవత్.. ఘటనాస్థలిలో మహ్మద్ సద్దార్ అనే వ్యక్తి వేలి ముద్రలు లభించాయని వెల్లడించారు. వీటి ద్వారా నిందితుణ్ని పట్టుకుని విచారించగా.. ఆయూబ్,నయూమ్లతో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు.
2015 నుంచి పలు రాష్ట్రాల్లో సద్దార్పై కేసులు నమోదయ్యాయని, మొత్తం 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సీపీ తెలిపారు. ఆయూబ్‌పై 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయూబ్‌పై 19 నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని వెల్లడించారు.