తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుట్ట మల్లారంలో ఎలక్ట్రిషన్ హత్య - వ్యక్తి హత్య వార్తలు భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుట్ట మల్లారంలో ప్రైవేట్​ ఎలక్ట్రిషన్​గా పనిచేస్తున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. అశ్వాపురంలో బంధువుల ఇంటికి వెళ్లిన యాకూబ్ తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం గుట్ట మల్లారంలో రహదారి పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. అది యాకూబ్​ పాషాగా గుర్తించారు.

గుట్ట మల్లారంలో ఎలక్ట్రిషన్ హత్య
గుట్ట మల్లారంలో ఎలక్ట్రిషన్ హత్య

By

Published : Nov 20, 2020, 7:52 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలో ఎస్కే యాకుబ్ పాషా(35) అనే వ్యక్తిని గురువారం అర్ధరాత్రి హత్య చేశారు. యాకూబ్ పాషా ప్రైవేట్ ఎలక్ట్రిషన్​గా పని చేస్తున్నాడు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి అశ్వాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు వెళ్లాడు. ఆ తర్వాత యాకూబ్​ పాషా ఒక్కడే మణుగూరుకు వెళ్లాడు.

శుక్రవారం ఉదయం రహదారి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో యాకుబ్ పాషా మరణించి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్సై నరేశ్​ చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన చరవాణి, ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాకూబ్ పాషా తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుట్ట మల్లారంలో ఎలక్ట్రిషన్ హత్య

ఇదీ చదవండి:క్షణికావేశంలో అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు

ABOUT THE AUTHOR

...view details