మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. 20 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మంచిర్యాల, లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి, బెల్లంపల్లి, తాళ్ల గురజాల, భీమిని, తాండూరు, కన్నెపల్లి, కోటపల్లి ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్ : సీపీ సత్యనారాయణ
మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తోన్న 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. సుమారు రూ.45 లక్షల విలువైన 15 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పక్కా సమాచారంతో దాడులు చేసి సుమారు రూ.45 లక్షల విలువైన 15 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పత్తికి ఎక్కువ ధర ఉండడంతో నకిలీ విత్తనాల వ్యాపారానికి అక్రమార్కులు తెర తీయాలని చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు చెప్పారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్రెడ్డి, అదనపు డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్, స్థానిక పోలీసుల సహాయంతో అక్రమ వ్యాపారుల గుట్టును ఛేదించామని సీపీ వివరించారు.
ఇదీ చదవండి:జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్