తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమతుల్లేకుండా మద్యం విక్రయం ... ముగ్గురు అరెస్ట్ - హైదరాబాద్​లో అక్రమ మద్యం సీజ్​

హైదరాబాద్​ టప్పాచబుత్ర పోలీస్​ స్టేషన్​ పరిధిలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంటిని తనిఖీ చేసి 150 మద్యం బాటిళ్లని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇకపై జరగనివ్వమని స్పష్టం చేశారు.

police raids on illegal liquor sales at Tappachabutra in hyderabad
అనుమతుల్లేకుండా మద్యం విక్రయం ... ముగ్గురు అరెస్ట్

By

Published : Oct 6, 2020, 6:41 PM IST

హైదరాబాద్ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమర్వాడీ వద్ద అనుమతి లేకుండా బెల్టు షాపు నడిపిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో సోదాలు చేసి 150 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాత్రివేళ మద్యాన్ని అమ్మడం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో అధిక ధరలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇకపై జరగనివ్వకుండా చూసుకుంటామని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో తనిఖీ చేసినట్లు ఎస్ఐ మధు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details