పేకాట ఆడుతున్న 15 మందిని డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 9 వేల నగదు, తుఫాన్ వాహనం, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో తొమ్మిది మంది పరారయ్యారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
డోర్నకల్లో అంతర్రాష్ట్ర పేకాట రాయుళ్లు అరెస్ట్ - మహబూబాబాద్ నేర వార్తలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పేకాట ఆడుతున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లక్షల తొమ్మిది వేల నగదు, కారు, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
డోర్నకల్లో అంతర్రాష్ట్ర పేకటా రాయుళ్ల అరెస్ట్
ముల్కలపల్లి శివారులో కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు. తప్పించుకున్న వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి