సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నాగారం మండలం పేరబోయిన గూడెం సమీపంలోని బికేరువాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై వి.హరికృష్ణ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 7 టాక్టర్లు పట్టివేత - అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు
సూర్యాపేట జిల్లా బికేరువాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై వి.హరికృష్ణ తెలిపారు. ఏడు ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 7 టాక్టర్లు పట్టివేత
ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతోపాటు ఏఎస్సై వెంకటేశ్వర రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:ఇసుక అక్రమ రవాణాకు చిరునామాగా ఆ జిల్లా
TAGGED:
suryapeta district news