తెలంగాణ

telangana

మంగళ్ హాట్​లో క్రికెట్ బెట్టింగ్​... ఇద్దరు అరెస్ట్​

By

Published : Oct 6, 2020, 7:53 PM IST

హైదరాబాద్​ మంగళ్​ హాట్​కు చెందిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.30లక్షలు, 2 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు

police-caught-cricket-betting-gang-at-mangla-haat-hyderabad
మంగళ్ హాట్​లో క్రికెట్ బెట్టింగ్​... ఇద్దరు అరెస్ట్​

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న ఇద్దరిని సౌత్ జోన్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.30లక్షల నగదు, 2 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లోని మంగళ్​ హాట్​కు చెందిన శంకర్ సింగ్, జావెద్, ఖదీర్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. చరవాణితో పాటు ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో వెళ్లి... వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కేసు నమోదు చేసుకొని నిందితులని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. వారిలో ఒకరైన ఖదీర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. శంకర్ సింగ్​పై మంగల్ హాట్, నార్సింగ్ ఠాణాల్లో ఇప్పటికే కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:17 ఏళ్ల బాలికను కత్తితో గాయపరిచిన అత్త

ABOUT THE AUTHOR

...view details