మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 35 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని వాహనం సీజ్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు - తెలంగాణ తాజా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నెల్లికుదురు మండలం రావిలాల శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి.. 35 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
బియ్యం అక్రమ రవాణాముఠా గుట్టురట్టు
నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఎండీ పాషా, మాదారపు రిషి ఈశ్వర్ కుమార్, ఓంకాల కుమార్, రవి, సతీష్, యాకయ్యతో పాటు రావిరాలకు చెందిన యాకాంతం... ముఠాగా ఏర్పడి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో మాటువేసి పట్టుకున్నారు. బియ్యం అక్రమరవాణా చేస్తే పీడీచట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.