తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సలాం కేసులో కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్​లో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కేంద్రం, సీబీఐకి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

pill-filed-in-ap high-court-in-salam-family-suicide-case-in-kurnool-district
సలాం కేసులో కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

By

Published : Nov 24, 2020, 12:55 PM IST

ఏపీలోని నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై విచారించిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఏపీ హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్నందున... ఆ శాఖవారితోనే విచారణ చేయించడం సమంజసం కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. సలాం కుటుంబ సెల్ఫీ వీడియోను పోలీసులు తమ ఎఫ్​ఐఆర్​లో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:గ్రేటర్​లో గెలుపు మాదే.. రెండో స్థానం ఎంఐఎందే: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details