ఓ వ్యక్తి తన భార్య చనిపోయిందని మనస్థాపానికి గురయ్యాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను తెలిపాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కారంపూడి మండలం గాదెవారిపల్లి గ్రామానికి చెందిన రాంపాటి అశోక్ భార్య ఈనెల 7వ తేదీన బలవన్మరణానికి పాల్పడింది. అప్పటినుంచి అశోక్ తన భార్యను తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఇక తాను బతికి ఉండకూడదని నిర్ణయించకున్నాడు. ఇవాళ ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. తన భార్య లేకుండా ఉండలేనంటూ.. సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన దంపతులకు ఏడాదిన్నర కవల పిల్లలు ఉన్నారు. మృతుడు అశోక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె లేకుండా బతకలేను.. మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి - గుంటూరులో భార్య చనిపోయిందని తెలిసి భర్త ఆత్మహత్య
నా భార్య చనిపోయింది. ఆమె లేకుండా నేను ఉండలేను.. ఎందుకు చనిపోయిందో కారణాలు చెప్పలేను.. ఆమె లేకుండా నేను ఉండలేను.. దయచేసి మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు తన బాధను సెల్ఫీ వీడియో తీశాడు.
ఆమె లేకుండా బతకలేను.. మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి