తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

200 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తోన్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దారి మళ్లిస్తున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

pds rice captured in manchirial district
200 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Sep 3, 2020, 11:19 AM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 200 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యాన్ని సివిల్​ సప్లై అధికారులు పట్టుకున్నారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా 6వాహనాల్లో 400బస్తాల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్​కు తరలిస్తున్న అక్రమార్కులను పక్కా సమాచారంతో సివిల్ సప్లై ఎన్​ఫోర్స్​మెంట్​ బృందం పట్టుకుంది.

మండలంలోని గుడిపేట్ శివారులో అడ్డా ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు ఆటోలు, ట్రాలీల్లో తరలిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వ్యాన్​లో లోడ్ చేస్తున్న సమయంలో ఎన్​ఫోర్స్​మెంట్​ బృందం గుర్తించి జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని స్థానిక తహసీల్దార్​, ఎస్సైతో కలిసి దాడి చేశారు. అప్పటికే అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయారు.

అక్కడ ఉన్న డీసీఎంతో సహా ఆరు వాహనాలు, రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ట్రాక్టర్ల ద్వారా సివిల్ సప్లై గోదాంకు తరలించారు. పట్టుబడ్డ వాహనాలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బియ్యాన్ని తరలిస్తున్న వారితో పాటు వాహన యజమానులపై సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేసు నమోదు చేస్తామని అన్నారు.

ఇవీ చూడండి: గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా

ABOUT THE AUTHOR

...view details