తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బీబీనగర్ భూకబ్జాదారునిపై పీడీ చట్టం నమోదు - యాదాద్రి భువనగిరి లేటెస్ట్ న్యూస్

వరుస భూ దందాలకు పాల్పడుతోన్న రౌడీ షీటర్ గోలనుకొండ ముత్యాలుపై పీడీ చట్టాన్ని నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​కు చెందిన ముత్యాలు స్థిరాస్తి వ్యాపారం చేస్తూ పలువురిని బెదిరించినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితునిపై 2011లో తొలి కేసు నమోదైందని తెలిపారు.

pd act on yadadri bhuvanagiri rowdy sheeter
బీబీనగర్ భూకబ్జాదారునిపై పీడీ చట్టం నమోదు

By

Published : Nov 24, 2020, 10:12 AM IST

భూదందాలు, కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతోన్న రౌడీ షీటర్ గోలనుకొండ ముత్యాలుపై పీడీ చట్టం నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వరుస అక్రమాలకు పాల్పడుతుండగా ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గోలనుకొండ ముత్యాలు స్థిరాస్తి వ్యాపారం చేస్తూ బెదిరింపులు, మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి అక్రమాలపై బీబీనగర్ పోలీస్ స్టేషన్​లో 2011లో మొదటి కేసు నమోదైందని పేర్కొన్నారు. నయీం అనుచరుడిగా పేరు చెప్పుకొని పలువురిని బెదిరించినట్లు వెల్లడించారు.

బీబీనగర్ శివారులోని ఓ వెంచర్​లో ప్లాట్లను కబ్జా చేసేందుకు తన అనుచరులతో కలిసి యజమానులపై బెదిరింపులకు పాల్పడ్డాడని... సెప్టెంబర్ 29న బీబీనగర్ స్టేషన్​లో మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైలుకు వెళ్లి, బెయిల్​పై వచ్చి... దందాలు కొనసాగిస్తుండగా పీడీ చట్టాన్ని నమోదు చేసి, రిమాండ్​కి తరలించినట్లు మహేశ్ భగవత్ వివరించారు.

ఇదీ చదవండి:మంత్రాల నెపంతో రైతు దారుణహత్య..

ABOUT THE AUTHOR

...view details