తెలంగాణ

telangana

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న పాత నేరస్థుడిపై పీడీ యాక్ట్​

బ్రాండెడ్​ విత్తనాల కవర్లలో నకిలీ పత్తి విత్తనాలు నింపి విక్రయిస్తున్న వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

By

Published : Oct 24, 2020, 1:14 AM IST

Published : Oct 24, 2020, 1:14 AM IST

PD Act against accused of selling counterfeit cotton seeds
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్​

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. నిందితుడు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇతడు తరచూ ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం వల్ల పీడీ చట్టం నమోదు చేసినట్లు రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​ తెలిపారు. ముఠాకు చెందిన ఇతర నేరగాళ్లపైనా గతంలోనే పీడీ చట్టం నమోదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లును రిమాండ్‌కు తరలించారు.

ఇదీ అసలు సంగతి..

కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లు మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి.. నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ నకిలీ విత్తనాలను అబ్దుల్లాపూర్‌మెట్​లోని ఓ గోదాంలో నిల్వ చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా బ్రాండెడ్‌ విత్తనాల కవర్ల ద్వారా ఈ నకిలీ విత్తనాలను మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details