తెలంగాణ

telangana

ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

By

Published : Nov 15, 2020, 3:58 PM IST

ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉపాధి దొరకపోవడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో ఈ ఘటన జరిగింది.

One person suicide in sangareddy dist do not get job
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ అనే వ్యక్తి కొంతకాలంగా ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు.

ఎంత ప్రయత్నించినా కొలువు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఇంటి పైభాగాన ఉన్న గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:వాగు దాటుతుండగా కాలువలో మునిగి మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details