కరీంనగర్ జిల్లాలో అతివేగానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పద్మానగర్‌కు చెందిన యోగా శిక్షకుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా... ఒకరు దుర్మరణం - ఎల్ఎండీ కాలనీ వద్ద ప్రమాదం
అతివేగం నిండుప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఇన్నోవా కారు మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
కరీంనగర్ పట్టణానికి చెందిన యోగా శిక్షకుడు మామిడాల సుధాకర్ ద్విచక్రవాహనంపై ఎల్ఎండీ కాలనీలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిలో పోలీసుల పర్యవేక్షణ, సూచికలు అమలులో ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. మరింత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.