పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామయ్యపల్లి స్టేజీ వద్ద మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని పట్టణానికి చెందిన కొమురోజు వెంకటరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దపల్లి నుంచి మంథనికి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వస్తున్న క్రమంలో రామయ్యపల్లి బస్టాండ్ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్టును ఢీకొట్టాడు.
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి - bike accident
ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి స్టేజీ వద్ద జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంథనికి తరలించారు.
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట రాములు సింగరేణిలో పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎస్సై ఓంకార్ యాదవ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి... మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని మంథనికి తరలించారు.
ఇవీ చూడండి: ఉద్యోగం నుంచి తీసేశాడని... కారు ఎత్తుకెళ్లిపోయాడు!