తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సుద్ధవాగులోకి ఒక్కసారిగా వచ్చిన వరద.. ఓ వ్యక్తి మృతి

గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో సుద్ధవాగులోకి ఒక్కసారిగా చేరిన వరదనీరు ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. రోజులాగే కులవృత్తి చేసుకోడానికి వెళ్లిన అతన్ని నీటి ప్రవాహం ముంచేసింది. ఈ విషాద ఘటన నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది.

one person dead in sudda vagu at bhainsa in nirmal district
సుద్ధవాగులోకి ఒక్కసారిగా వచ్చిన వరద.. ఓ వ్యక్తి మృతి

By

Published : Oct 19, 2020, 8:05 AM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణ సమీపంలో ఉన్న గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువన ఉన్న సుద్ధ వాగులోకి నీటిని వదిలారు. అంతకుముందే సుద్దవాగులోకి వెళ్లిన పట్టణంలోని ధోబీగల్లికి చెందిన చాకలి చిన్నన్న(50) వాగులో ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రహావానికి గల్లంతయ్యాడు.

అయితే కొద్దిసేపటి తరువాత ప్రాజెక్టులో నీరు తగ్గడం వల్ల గేట్లను మూసివేశారు. వ్యక్తి గల్లంతైన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించడంతో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పెళ్లిచేసుకోమన్నందుకు యువతిపై కత్తితో దాడి.. ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details