ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన థామస్ (25) ఏడు నెలల క్రితం భాగ్యనగరానికి వచ్చి సుచిత్రలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో నివాసముంటూ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించాడు. ఆ మత్తులో మూడంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందాడు.
మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి యువకుడి మృతి - medchal district news
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత మంది చెప్పినా చెప్పినా కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి సంఘటనే మేడ్చల్ జిల్లా సుచిత్రలో చోటుచేసుకుంది. ఓ యువకుడు అతిగా మద్యం సేవించి ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు.

మూడంతుస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతి
ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆత్మహత్యకు ముందు కేటీఆర్‌కు ట్వీట్.. సోనూసూద్‌కు మెయిల్..!