తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒకరిది ప్రేమ పేరుతో మోసం.. మరొకరిది అత్యాచారయత్నం - భద్రాద్రి జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఒకరు ప్రేమ పేరుతో మైనర్​ను గర్భవతిని చేస్తే.. మరొకరు అత్యాచారానికి యత్నించారు. గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల మార్నిల రామకృష్ణ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమ్మని అడిగితే నిరాకరించాడు. ఇదిలా ఉంటే.. గాండ్ల గూడెంకు చెందిన 21 ఏళ్ల ఆలావత్​ దొరబాబు.. పదహారేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించాడు.

ఒకరిది ప్రేమ పేరుతో మోసం.. మరొకరిది అత్యాచారయత్నం
ఒకరిది ప్రేమ పేరుతో మోసం.. మరొకరిది అత్యాచారయత్నం

By

Published : Nov 16, 2020, 8:33 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఒక గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల మార్నిల రామకృష్ణ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చనువు పెంచుకుని తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. తాను గర్భవతిని అయ్యానని.. త్వరగా పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడింది. అందుకు ఆ యువకుడు కాదు పొమ్మన్నాడు.

తన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం తెలిపింది. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కూడా యవకుడి కాళ్ల వేళ్ల పడ్డారు. అయినా ఆ యువకుడి కఠిన హృదయం కరగలేదు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. ఇదే మండలంలోని గాండ్ల గూడెంకు చెందిన 21 ఏళ్ల ఆలావత్​ దొరబాబు.. పదహారేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న బాలిక ఇంట్లోకి దూరి తన కామ వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వారు మేల్కోవడం వల్ల దొరబాబు పారిపోయాడు. బాధితురాలని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details