హైదరాబాద్ మలక్‌పేటలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిపై వెళుతున్న కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్జల్‌గంజ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కారులో చెలరేగిన మంటలు... త్రుటిలో తప్పిన ప్రమాదం - fire accident to car
హైదరాబాద్ మలక్‌పేటలో రహదారిపై వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు ఉండగా... సకాలంలో అందరూ దిగడంతో ప్రాణాపాయం తప్పింది.
Nothing happened to anyone in car accident
ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంటనే గమనించి కారులో ఉన్న వారిని అప్రమత్తం చేశాడు. అందరిని కిందకి దించేశాడు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. ఎవరికీ ఏమీ కాకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.