ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో జరిగిన హత్య కేసు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈనెల 24వ తేదీన తెలుగు దస్తగిరి అతని భార్య వన్నూరమ్మ పొలానికి వెళుతూ ఓ టిఫిన్ సెంటర్ వద్ద కూర్చొని ఉండగా వెనుక నుంచి వచ్చిన మిన్నెల్ల హుస్సేన్ కొడవలితో దస్తగిరి తలపై గట్టిగా మోదాడు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన హత్యకేసు నిందితుడు
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపం, మరోవైపు తన అనారోగ్యానికి కారణమన్న అనుమానంతో మిన్నెల్ల హుస్సేన్ అనే వ్యక్తి దస్తగిరిని చంపేశాడు. ఈ హత్య తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో జరిగింది.
కర్నూలులో పోలీసుల ఎదుట లొంగిపోయిన హత్యకేసు నిందితుడు
ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. తన చిన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనకు పక్షవాతం రావటానికి చేతబడి చేయించాడన్న అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని కర్నూలు డీఎస్పీ మహేశ్ తెలిపారు.