సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలాల్లో శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి ఊరి శివారులో ఆడ శిశువును వదిలి వెళ్లారు. తీవ్ర చలిలో శిశువు పడి ఉండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. ఉదయం అటుగా వెళ్తున్న కూలీలు శిశువుని చూసి... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమానుషం... పంటపొలల్లో శిశువు మృతదేహం - telangana news
పసికందును వదిలేశారు ఆ కసాయి తల్లిదండ్రులు. కళ్లు తెరవక ముందే పంట పొలాల్లో పడేశారు. తీవ్ర చలిలో విగత జీవిగా పడిఉన్న చంటిబిడ్డను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఇంతకీ ఆ పసికందును చంపేసి పడేశారా? లేక వదిలేస్తే చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.
అమానుషం: పంటపొలల్లో శిశువు మృతదేహం
చనిపోయిన శిశువును వదిలి వెళ్లారా? లేక ఆడపిల్ల పుట్టిందని వదిలేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిశువు తల్లిదండ్రుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చిలుకూరు ఎస్సై నాగభూషణం తెలిపారు. ఆ చంటిబిడ్డ మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:'నా భర్తను చంపి.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే నీచంగా మాట్లాడుతున్నారు'