రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి - రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి
16:26 September 12
రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి
హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈనెల 10న రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన నాగులు... జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరవై ఏళ్ల క్రితం కుటుంబీకులతో హైదరాబాద్‌కు వచ్చిన నాగులు.. ఓ అపార్ట్మెంటులో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈనెల 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శరీరం కాలుతున్నా... జై తెలంగాణ... జై కేసీఆర్ నినాదాలు చేశాడు.