ఏపీలోని కృష్ణా జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. కారు ఫైనాన్స్ డబ్బులు అడిగేందుకు వెళ్ళిన ఓ ఉద్యోగిపై తండ్రికొడుకులు కత్తితో దాడి చేశారు. చిలకలపూడికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని, అతని కుమారుడు ఇద్దరు కలిసి ఫైనాన్స్ ఉద్యోగి రాజేశ్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
దారుణం: ఫైనాన్స్ డబ్బు అడిగినందుకు కత్తితో పొడిచారు - కారు ఫైనాన్స్ డబ్బు అడిగినందుకు కత్తితో పొడిచారు
కారు ఫైనాన్స్ డబ్బులు అడిగేందుకు వెళ్ళిన ఓ ఉద్యోగిపై తండ్రికొడుకులు కత్తితో దాడి చేసిన ఘటన.. ఏపీలోని కృష్ణా జిల్లా మాచవరంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దారుణం: ఫైనాన్స్ డబ్బు అడిగినందుకు కత్తితో పొడిచారు
మాచవరంలో రోడ్డులో రాజేశ్‌ను కత్తితో పొడిచి పక్కనే ఉన్న మురుగునీటి కాల్వలో పడేసి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్‌కు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హత్యకు యత్నించిన తండ్రి కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:మరో మోసం: హైదరాబాద్‌లో ఓ కంపెనీ పేరుతో రూ.156 కోట్లు కాజేశారు