నిజామాబాద్‌లోని నాందేవ్ వాడకు చెందిన రూపేశ్, సతీశ్‌లు అన్నదమ్ములు. సతీశ్ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సోమవారం సతీశ్ మద్యం తాగొచ్చి అన్న రూపేశ్‌తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రూపేశ్, తమ్ముడిని బండరాయితో కొట్టి హతమార్చాడు.
అనంతరం తల్లి మమతతో కలిసి హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.