ఈ క్రమంలో ఆదివారం రాత్రి మృతుడి తల్లి రాజమణి నిర్వహించే దుకాణం నుంచి తల్లీకూతుర్లు వస్తుండగా డేవిడ్ మరోసారి తీవ్రంగా దూషించాడు. ఈ విషయాన్ని రాత్రి 10 గంటలకు పృథ్వీరాజ్‌కు తెలిపారు. అక్కడికి చేరుకున్న పృథ్వీరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి డేవిడ్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఆ సమయంలో డేవిడ్ అతని కుమారుడు ఓసెఫ్ వీరిపైకి దూసుకొచ్చి ఒకరినొకరు కిందకు తోసుకున్నారు. డేవిడ్ తన వద్ద ఉన్న పదునైన కత్తితో పృథ్వీరాజ్ గుండె భాగంలో పొడవటంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు.
జూబ్లీహిల్స్‌లో హత్య.. ప్రశ్నించడమే కారణం.. - nims
తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని అడిగిన పాపానికి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు తండ్రీ కొడుకులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వీడియోగల్లీలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
ఇవీ చూడండి: ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత
Last Updated : Mar 13, 2019, 11:32 AM IST