ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఆ తల్లికి ఇష్టం లేదు... దీంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ముందు తన పిల్లలకు ఉరేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. విచారణకు వెళ్లిన పోలీసులకు అసలు విషయాలు తెలియడంతో నిజం బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్యం గ్రామంలో శనివారం ఉదయం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మొదట అందరూ వాటర్ హీటర్ కారణంగా విద్యుత్ షాక్ తగిలిందని విషయం భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక.. మొదట తన పిల్లలు నిశ్చల్, వెంకట సాయిలకు ఉరేసి, తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.