తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బడికి వెళ్లలేదని పిల్లాడి ఒంటిపై వాతలు పెట్టిన తల్లి

ఎవరైనా తిట్టినా, కొట్టినా ఇంటికెళ్లి తల్లికి ఫిర్యాదు చేస్తుంటారు చిన్నారులు. అలాంటిది తల్లే విచక్షణ కోల్పోయి కన్నబిడ్డనే కర్కశంగా శిక్షిస్తే...ఇంకెవరికి చెప్పాలి.. అభంశుభం తెలియని ఆపిల్లాడి ఒంటిపై తల్లి వాతలు పెడితే ఆ బాధను దిగమింగుకుని మెట్లపైనుంచి పడిపోయానని చెప్పుకున్నాడే తప్ప తల్లి కర్కశత్వాన్ని బయటపెట్టలేదు. చూపరుల హృదయాన్ని కలచివేసే ఘటన మెదక్​ జిల్లా తూప్రాన్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By

Published : Mar 26, 2019, 6:16 PM IST

Updated : Mar 26, 2019, 7:53 PM IST

పిల్లాడిపై తల్లి కర్కశత్వం

పిల్లాడిపై తల్లి కర్కశత్వం
పిల్లాడు పాఠశాలకు వెళ్లలేదని ఓ తల్లిగరిట కాల్చి మొహంమీద, కాలి మీద వాతలు పెట్టింది.మెదక్​జిల్లా తూప్రాన్​లోని ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి​ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈనెల 19న పాఠశాలకు గాయాలతో వచ్చాడు. ఏమైందని ఉపాధ్యాయురాలు ఆరా తీయగా ఇంటిదగ్గర మెట్లపైనుంచి జారిపడ్డానని చెప్పాడు.

అసలు విషయం ఇలా తెలిసింది

అనుమానమొచ్చినఉపాధ్యాయులువిద్యార్థి సోదరుడిని అడిగితే అసలు విషయం చెప్పాడు. పాఠశాలకు వెళ్లలేదని అమ్మ గరిట కాల్చిఅన్నయ్య ఒంటిమీద వాతలు పెట్టినట్లు వివరించాడు.పాఠశాలకు వెళ్లలేదని తన తల్లి వాతలు పెట్టిందని అమాయకంగా చెప్పాడు.

మరీ ఇంతలా ఉంటారా..!

అసలెందుకు ఇలా చేసిందని బాలుడి తల్లికి ఎన్నిసార్లు ఫోన్​ చేసినా కనీసం స్పందించలేదని ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలు తప్పుచేస్తే మందలించాలి గాని పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పట్లఇంత కఠినంగా ఉంటారా.. వీలైతే ఉపాధ్యాయులకు చెప్పండి... లేకుంటే ప్రేమగా తెలియజేయండి.. ఇలాంటి చర్యలకు పాల్పడి చిన్నారులను హింసించకండి.


ఇదీ చదవండి:ప్రేయసి కోసం ఠాణాలోనే ఆత్మహత్యాయత్నం

Last Updated : Mar 26, 2019, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details