తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం - సంగారెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో తల్లి ఇద్దరు పిల్లలతో సహా బయటికి వెళ్లి అదృశ్యమైంది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అనుమానంతో భర్త పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Mother And Two Childrens missing in Sangareddy District
ఇద్దరు పిల్లలతో సహా.. తల్లి అదృశ్యం

By

Published : Oct 25, 2020, 8:07 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​కు చెందిన భీములు పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామంలో తోషిబా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ.. భార్య లలిత, ఇద్దరు పిల్లలు ప్రవీణ్​, దీపికలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. లలిత పిల్లలను తీసుకొని ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయింది.

విషయం తెలుసుకున్న భీములు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికాడు. ఎంతకూ వారి ఆచూకీ లభించలేదు. అనుమానంతో శనివారం పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 నెలల క్రితం కూడా లలిత ఇలాగే ఇల్లు వదిలి వెళ్లిపోతే.. భీములు వెతికి తీసుకొచ్చాడు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కోలాహలంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details