ఇంట్లో విగతజీవులుగా తల్లీ, కుమార్తె.. అసలేం జరిగింది? - మహబూబ్‌నగర్ వార్తలు
10:12 September 28
ఇంట్లో విగతజీవులుగా తల్లీ, కుమార్తె.. అసలేం జరిగింది?
తల్లీ, కుమార్తె అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పుర్ మండలం శేరిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన విజయలక్ష్మి, ఆమె కుమార్తె మౌనిక (19) ఉరి వేసుకొని మృతిచెందారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగిందని.. ఉదయం తల్లీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన తగాదాకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా..? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.