ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీబిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడపకు చెందిన శ్రావణికి శివకుమార్ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది. శివకుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య - shankarapuram mother and child suicide news
తల్లీ, బిడ్డ ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని కడప జిల్లా శంకరపురంలో జరిగిన ఈ ఘటన... స్థానికులను కలచివేసింది.
ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య
కుమార్తె తన్వికతో కలిసి శంకరాపురంలోనే శ్రావణి నివాసం ఉండేది. గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:హైస్కూల్లో మంటలు.. తప్పిన ప్రమాదం