తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బత్తాయిపండ్ల డీసీఎం వ్యాన్​ బోల్తా.. ఇద్దరికి గాయాలు

బత్తాయి పండ్ల లోడుతో నిజామాబాద్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. కాగా అందులోని ఇద్దరు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి.

mosambi load lorry rolled over at bikkanur in kamareddy district
బత్తాయిపండ్ల డీసీఎం వ్యాన్​ బోల్తా.. ఇద్దరికి గాయాలు

By

Published : Nov 7, 2020, 7:10 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తాయి పండ్ల లోడుతో ఉన్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. ఆ వ్యాను నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్తున్నారు.

కాగా అందులోని ఇద్దరు వ్యక్తులకు స్వల్పగాయలయ్యాయి. బండిలో ఉన్న పండ్లు కింద పడడం వల్ల చుట్టుపక్కల వాళ్లు అధిక సంఖ్యలో వచ్చి వాటిని తీసుకెళ్లారు.

బత్తాయిపండ్ల డీసీఎం వ్యాన్​ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఇదీ చూడండి:తాగొచ్చిన ఆబ్కారీశాఖ అధికారిని నిర్భందించిన ఆదివాసీలు

ABOUT THE AUTHOR

...view details