కరోనాతో మియాపూర్ ఏఎస్సై మృతి - corona cases in hyderabad
కరోనా మహమ్మారి బారిన పడి పోలీసు సిబ్బంది బలవుతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా మియాపూర్ ఏఎస్సై విశ్వనాథం మృతి చెందారు.
కరోనా బారిన పడిన రంగారెడ్డి జిల్లా మియాపూర్ ఏఎస్సై వి.విశ్వనాథం (56) చికిత్స పొందుతూ మృతిచెందారు. గతనెల 18న కొవిడ్ లక్షణాల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. విశ్వనాథం స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం. ఆయన తాండూరు, మొయినాబాద్, వికారాబాద్, పహాడీషరీఫ్, సరూర్‌నగర్, కుషాయిగూడ, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేశారు. 2016లో మాదాపూర్ నుంచి మియాపూర్‌కు బదిలీ అయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ వెంకటేష్ తదితరులు సంతాపం తెలిపారు.