మద్యం మత్తులో భవనంపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హంసరాజ్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామానికి వలస వచ్చాడు. గ్రామంలోని మైత్రి కాలనీలో నివాసం ఉంటూ దంపతులిద్దరూ కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మద్యం మత్తులో వలస కార్మికుడు మృతి - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు
మెరుగైన జీవితాన్ని ఆశించి రాష్ట్రానికి వలస వచ్చిన ఓ వ్యక్తిని మద్యం మత్తు కాటేసింది. బతుకుదెరువు కోసం నగరానికి చేరిన వలస కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
కూలి పనికి వెళ్లి వచ్చిన హంసరాజ్ తను నివాసం ఉంటోన్న ఇంటి పైకి వెళ్ళి మద్యం సేవించారు. అనంతరం కిందకు వస్తోన్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి మెట్లపై నుంచి పడిపోయాడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం పటాన్‌చెరులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ నుంచి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండీ:'రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు'