అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు అల్లుడే తమ కూతురిని చంపాడని ఆరోపిస్తున్నారు.
రెండు నెలల క్రితమే వివాహం

సూర్యాపేట జిల్లా చిలకలూరు మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కవిత (19)కు అదే జిల్లాకు చెందిన హుజుర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వాకదాని వెంకటకృష్ణతో రెండు నెలల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. ఉద్యోరిత్యా కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామంలో వెంకటకృష్ణ, కవిత అద్దెకు ఉంటున్నారు.
మంగళవారం అద్దె ఇంట్లోనే కవిత ఉరేసుకుని చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు అల్లుడే తమ కూతురిని హత్య చేశాడని ఆరోపించారు. అతనికి వేరే అమ్మాయితో విహహేతర సంబంధం ఉందని.. ఆ కారణంగానే రోజూ తమ బిడ్డను హిసించేవాడని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఒళ్లు గగుర్పొడిచే కిల్లర్ కథ... 18 హత్యల వెనుక క్రైం కహానీ!