తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిర్మల్​లో వివాహిత అదృశ్యం.. వంతెనపై దొరికిన స్కూటీ, చెప్పులు - నిర్మల్​ క్రై వార్తలు

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన నిర్మల్​ జిల్లాకేంద్రంలోని ఏఎన్​రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Married Women Missing in Nirmal Town
నిర్మల్​లో వివాహిత అదృశ్యం.. వంతెనపై దొరికిన స్కూటీ, చెప్పులు

By

Published : Sep 25, 2020, 9:06 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన తోట మౌనిక అనే వివాహిత గురువారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నిర్మల్​ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోన్ మండల కేంద్రంలోని గోదావరి వంతెనపై మౌనిక ద్విచక్రవాహనం, చెప్పులు దొరికాయి. వంతెనపై ద్విచక్ర వాహనం చెప్పులు కనిపించటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందేమో అని అనుమానం చేస్తున్నారు. ఎవరికైనా మౌనిక ఆచూకీ లభిస్తే 9440795018, 7901122512 నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

ఇదీ చదవండిఃదుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

ABOUT THE AUTHOR

...view details