పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈరోజు ఉదయం గోల్కొండ సాయి కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు ముగ్గురి వేధింపులే కారణమని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే వ్యాపారాన్ని బుర్ర శ్వేత, బుర్ర రాజు, కరుణాకర్‌లతో కలిసి పెట్టారని తెలిపారు. వారు తన భర్తను వ్యాపారంలో మోసం చేశారని పోలీసులకు వివరించారు.
ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య - crime news
ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
ఈరోజు ఉదయం తాము ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారని తెలిపారు. తన భర్త చనిపోయే ముందు తన చావుకు కారణం బుర్ర శ్వేత, బుర్ర రాజు, కన్నూరి కరుణాకర్లే కారణమని లేఖ రాశారని చెప్పారు. వారి ముగ్గురిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీ చూడండి: తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "